తెలంగాణపై సంప్రదింపులు అవసరం లేదు: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి ఆజాద్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం తీవ్రంగా ఖండించారు. తెలంగాణపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని.. సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్రానికి సూచించారు. పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో సమస్యలు వస్తే ప్రభుత్వాలే పరిష్కరించాయని గుర్తు చేశారు. ఎవరో రాష్ట్రం ఇస్తారని ప్రజలు ఆలోచించవద్దని సూచించారు. తెలంగాణ కవాతు కంటే ఉద్థృతమైన ఉద్యమాన్ని నిర్మస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆజాద్‌కు ఎవరి నుంచి ఆక్షేపణలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు.



