తెలంగాణలో జోక్యం చేసుకోండి టీ.మంత్రులు

హైదరాబాద్‌, జనవరి 01 : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు తెలిపారు. మంగళవారం ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జిని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు కలుసుకున్నారు. తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని వారు రాష్ట్రపతికి విన్నవించినట్టు సమాచారం. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జిని కలిసిన వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా శీతకాల విడిదిని పూర్తి చేసుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. శీతకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి డిసెంబర్‌ 26వ తేదీ సాయంత్రం నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే.