తెలంగాణ అంశంపై చంద్రబాబు లేఖలో స్పష్టత లేదు: పొన్నం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వాలని అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ అంశంపై చంద్రబాబు లేఖలో స్పష్టత లేదని పొన్న అన్నారు. తెలంగాణ మంత్రులు విజ్ఞప్తి చేసినా అనుమతి ఇవ్వకపోతే ప్రభుత్వానికే అగౌరవం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు కేకే ఇంట్లో తెలంగాణ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తామని పొన్నం తెలిపారు. ప్రపంచంలో ఏ అంశంపైనా ఏకాభిప్రాయం సాధ్యం కాదని కేకే వ్యాఖ్యానించారు.