తెలంగాణ అంశంపై చర్చకు తెరాస పట్టు

హైదరాబాద్‌ : తెలంగాణ అంశంపై శాసనసభలో చర్చించాలని తెరాస పట్టు పడుతోంది. తెరాస ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ కోతలపై చర్చించాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లడంతో సభలో గందరగోళం ఏర్పడింది.