తెలంగాణ ఉద్యమకారుడు సైదులు భౌతిక కాయానికి

share on facebook

తెలంగాణ ఉద్యమకారుడు సైదులు భౌతిక కాయానికి నివాళులర్పించిన టిఆర్ఎస్ నాయకులుతెలంగాణ ఉద్యమకారుడు సైదులు భౌతిక కాయానికి నివాళులర్పించిన టిఆర్ఎస్ నాయకులు
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (2): మండల పరిధిలోని తాడిపర్తి గ్రామానికి చెందిన టిఆర్ఎస్వి నేత  తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు సామోని సైదులు శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మండల అధ్యక్షులు గాజుల కోదండం, మండల సీనియర్ నాయకులు మంద కోటేశ్వర్ రెడ్డిలు, సైదులు భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు  సామోని సైదులు కుటుంబానికి  మంద కోటేశ్వర్ రెడ్డి 3000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనంతరం  వారు మాట్లాడుతూ సైదులు మరణం టిఆర్ఎస్ పార్టీకి, విద్యార్థి విభాగానికి తీరని లోటు అని  సైదులు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని  ప్రార్థించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దొడ్ల రాములు, శరత్ బాబు, సురేందర్, శ్రావణ్ కుమార్, టిఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వడ్డేమాన్ రవి, నాగరాజు, యాదగిరి, తదితరులు ఉన్నారు

Other News

Comments are closed.