తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో 17న సన్నాహక మోటారు సైకిల్ ర్యాలీ
హైదరాబాద్: తెలంగాణ ఐకాస ఇచ్చిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు తెలంగాణ న్యాయవాదుల ఐకాస సన్నాహక మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీ ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు, నాంపల్లి కోర్టు నుంచి ప్రారంభమై నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ర్యాలీ తిరగనున్నట్లు ఐకాస నాయకులు తెలియజేశారు, సెప్టెంబరు 30న జరిగే మార్చ్‌లో పాల్గొనేందుకు ప్రజలను సమాయత్తం చేసేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ర్యాలీకి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు.



