తెలంగాణ మంత్రులు తెలంగాణ కోసం పోరాటం చేయాలి: హరీష్రావు
హైదరాబాద్: తెలంగాణ కోసం మంత్రులు ఢిల్లీ పర్యటనలు చేయడం ఎవరికి వారే అన్నట్లుగా ఉందని, ఉత్పుత్తి పర్యటనల వల్ల ఏం ప్రయోజనం ఉండదని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేంద్రాన్ని ఒప్పించడం లేదా రాజీనమా చేసి తెలంగాణ కోసం పోరాడటం చేస్తే ప్రజలు వారిని విశ్వసిస్తారని ఆయన సచివలయంలో మీడియాతో అన్నారు. ముందుగా తెలంగాణ మంత్రులు ఐక్యత పెంచుకోవాలని అనంతరం అందరూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.



