తెలంగాణ మార్చ్‌పై విసృత ప్రచారం : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై విసృత ప్రచారం చేస్తామని తెలంగాణ రాజకీయ ఐకాసఛైర్మన్‌ ప్రొ.కోదండరాం అన్నారు. తెలంగాణ మార్చ్‌ను శాంతి భద్రతల సమస్యగా చూడొద్దని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. సికింద్రాబాద్‌లోని తెలంగాణ ఫిలింఛాంబర్‌లో తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఇంటికో మనిషి, చేతితో జెండా నినాదంగా తెలంగాణ మార్చ్‌పై ప్రచారం నిర్వహిస్తామన్నారు.