‘ తెలంగాణ రావాలంటే కాంగ్రెస్‌ను బలపర్చాలి’

హైదరాబాద్‌: తెలంగాణ రావాలంటే తెలంగాణవాదులు కాంగ్రెస్‌ పార్టీని బలపర్చాలని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కోరారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను, ఇతర ప్రాంతాల వారిని ఒప్పించేందుకు తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని సర్వే తెలియజేశారు. తెలంగాణ అంశం యూపీఏ, కాంగ్రెస్‌ అజెండాలో ఉందని పేర్కొన్నారు.