తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం :రాష్ట్ర నేత మాజీ సింగిల్విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని  రాష్ట్ర నేత మాజీ సింగిల్విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.    మహేశ్వరం నియోజకవర్గం  రాష్ట్ర నేత మాజీ సింగిల్విండో చైర్మన్   కొలను శంకర్ రెడ్డి  బృందం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రజా సంగ్రామ యాత్ర  కన్వీనర్  , గంగిడి మనోహర్ రెడ్డి  ని  సైదాబాద్ లోని వారి నివాసంలో లో కలిసి  విశ్వఖ్యాతి పొందిన  బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని అందించి శాలువాతో సన్మానించడం జరిగింది, ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  ప్రజా సంగ్రామ రథసారథి  బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ సభ్యులు చేపట్టినా నాల్గవ విడత యాత్ర జయప్రదం కావాలని, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కావాలని అందుకు గణేష్ భగవాన్ ని ఆశీస్సులు ఉండాలని కోరడం జరిగినది, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు  సంజీవరెడ్డి, అనంత రెడ్డి, రాజేష్, రమేష్ కుమార్, తిరుపతి రెడ్డి, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు