తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్మం : పోచారం శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందేనని తెరాస డిమాండ్‌ చేసింది. బాబ్లీ నిర్మాణం వల్ల 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉత్తర తెలంగాణలో ఎడారిగా మారనుందని ఆ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఫలితంగా రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని అన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దఫా కింద పనులు ప్రారంభించాలని మరో ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్‌ చేశారు. కంతాలపల్లి ప్రాజెక్టుకు ఉద్యమిస్తామని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల అన్నారు.