తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది:కేకే
హైదరాబాద్: తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్దమని, తెలంగాణ ద్రోహులే మా శత్రువులని కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు టీఎన్జీవోల అభినందన సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది కాంగ్రెసేనని, తెలంగాణ ప్రజలందరు తెలంగాణ కోరుకుంటున్నారని కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పోరాటం అభినందనీయమని కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు కొనియడారు.