తెలంగాణ వాదన వినిపించే పార్టీలతో ఫ్రంట్ యోచన: దామోదర్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉందని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగానే నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ వాదం వినిపించే పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు యోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 9 లోగా తమ కార్యాచరణ పై కొంత స్పష్టత వస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో వైకాపా బలంగా ఉందని అంటున్నప్పటికీ క్షత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు.



