తెలంగాణ సాధనకు జనవరి నెలంతా పోరాట కార్యక్రమాలు : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకు జనవరి నెలంతా పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రొ. కోదండరాం తెలియజేశారు. జనవరి 26లోగా తెలంగాణపై కేంద్రం నిర్ణయాన్ని వెలువరించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ ధూంధాం కార్యక్రమాలే నిర్వహిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ద్వాఆ తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్‌ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. అఖిలపక్ష సమావేశంలో వైకాపా గోడమీద పిల్లవాటాన్ని ప్రదర్శించిందని ఆరోపించారు.