తెలంగాణ సాధనకు కలసిరావాలి:కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలోని అన్నీ వర్గాలకు చెందిన వారు తెరాసకు చేయూతనిస్తే తెలంగాణ రాష్ట్ర సాధన త్వరగా సాధ్యమవుతుందని తెరాస నేత కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మట్లాడుతూ కాంగ్రెస్‌ను పాతేరేయాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపిస్తారని తెలియజేశారు. సీమాంధ్ర నేతల ఆధీనంలో ఉన్న తెలంగాణవాదులందరూ రాష్ట్ర సాధనకు కలిసిరావాలని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి వైకాపా అధ్యక్షుడని కేటీఆర్‌ విమర్శించారు. విలువలు, విశ్వసనీయత గురించి వైకాపా నేతలకు తెలియదని ఆయన వైకాపా వైఖరిని దుయ్యబట్టారు.