తెలుగు భాషా పరిరక్షణకు తానా కృషి :తోటకూర ప్రసాద్‌

గుంటూరు: ప్రవాసాంథ్రుల సంఘం తానా ఆధ్వర్యంలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తానా అధ్యక్షులు తోటకూరప్రసాద్‌ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఈ నెల 22న ఖమ్మంలో జానపద కళోత్సవం, ఈనెల 23,24 తేదీలలో గుంటూరు జిల్లా రేపల్లెలో వైద్య శిబిరాలు, రైతు సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 25న హైదరాబాద్‌లోని జూబ్లీహల్‌లో సాహిత్య సమావేశం నిర్వహించనున్నట్లు  వెల్లడించారు.