తెలుగు సినిమాల పై సేవా పన్ను రద్దు చేయాలని ధర్నా

హైదరాబాద్‌: తెలుగు సినిమాల పై ప్రభుత్వం విధించిన సేవాపన్ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఫిల్మ్‌ఛాంబర్‌లోని రామానాయుడు కళామండపంలో ధర్నాకు దిగింది. అదాయపు పన్ను, వినోదపు పన్నులతోపాటు ఇతర పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం 12.3 శాతం సేవాపన్ను విధించడం భారంగా మారిందని పలువురు నిర్మాతలు, నటు, దర్శకలు ఆవేదన వ్యక్తం చేశారు. సేవాపన్నును వెంటనే ఉపసంహరించకోవాలని లేని పక్షంలో దీక్షలకు దిగుతామని హెచ్చారించారు.