తెలుగు సివిల్స్‌ రాసే అభ్యర్థులకు న్యాయం జరగాలి

అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌
తెలుగు సివిల్స్‌ రాసే అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని
అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ కోరారు. ఈ అంశం కేంద్రం దృష్టికి తేసుకెళ్లాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు ఆయన లేఖలు రాశారు. తెలుగు అభ్యర్థుల పట్ల వివక్షను విడనాడాలని కోరారు. ద్వారకానాధశాస్త్రి రచించిన తెలుగు సాహిత్య చరిత్ర పుస్తకాన్ని మండలి బుద్ధ ప్రసాద్‌ ఈ రోజు ఆవిష్కరించారు.

తాజావార్తలు