తొలుత వైఖరి చెప్పాల్సింది కాంగ్రెస్స్ :మందకృష్ణ
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తొలుత వైఖరి స్పష్టం చేయాల్సింది. కాంగ్రెస్ పార్టీనేనని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎప్డీఐ, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక వంటి విషయాల్లో తొలుత నిర్ణయం తీసుకుని తర్వాత విపక్షాల ముందు చర్చకు పెట్టిన అధికారపార్టీ తెలంగాణ విషయంలో అలా ఎందుకు వ్యవహరించడం లేదని నిలదీశారు. అఖిపలక్షానికి ఇద్దరేసి సభ్యులను పంపుతున్న వివిధ పార్టీలు అందులో ఒకరు తప్పనిసరిగా వెనుకబడిన తరగతి వారు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ అంశాన్ని నాన్చేందుకే కేంద్రం అఖిలపక్షం నిర్వహిస్తోందని విమర్శించారు.