త్రిపుల్ ఐటీలో కటుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
కడప : ఇడుపులపాయ త్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని దాదాపు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. త్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న మెన్‌లో ఆదివారం రాత్రి విద్యార్థులకు చికెన్ బిర్యానీతోపాటు ఇతర వంటకాలను వడ్డించారు. వీరందరిని అర్ధరాత్రి సమయంలో వేంపల్లె ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. భోజనాలు తయారు చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు వాడిన వంటనూనెను తిరిగి వాడటం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.



