వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ :పార్థసారధి
హైదరాబాద్: వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి వెల్లడించారు. వచ్చే డీఎస్సీలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. 4 వేల వరకు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులనియామకాలు చేపడతామని వెల్లడించారు.



