థర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కాకరాపల్లి ధర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మళ్లీ ఆందోళన తలెత్తింది. ఆందోళన చేపట్టిన సీతారాంపురం, కేసినాయుడుపేట గ్రామస్థులు నౌపాడ రహదారిపై వంటావార్పు, సామూహిక సహపంక్తి భోజనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.



