దర్రా ఆదం ఖేల్‌లో పేలుడు.. 10 మంది మృతి
పెషావర్: కాకిస్థాన్‌లోని కొహత్ ప్రాంతంలోని దర్రా ఆదం ఖేల్‌లో ముష్కరులు బాండు దాడితో విరుచుకుపడ్డారు. రద్దీ ప్రాంతమైన జగన్ బజార్‌లో జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన అధికార సిబ్బంది క్షతగాత్రులను పెషావర్, కొహత్ ఆసుపత్రులకు తరలించారు.



