దుబాయ్‌లో అగ్నిప్రమాదం

దుబాయ్‌: దుబాయ్‌లోని ఒక బహుళ అంతస్థుల భవనంలో ఆదివారంనాడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్‌ దక్షిణ ప్రాంతంలో ఉన్న జుమేర లేక్‌ టవర్స్‌ అనే 34 అంతస్థుల భవనం నుంచి అందరినీ ఖాలీ చేయించినట్లు అధికారులు తెలియజేశారు. అగ్నిప్రమాదం తాటూకు నష్టాలగురించి ఇంకా పూర్తి సమాచారం అందవలసి ఉంది.