దుర్వినియోగాన్ని ఆరికట్టేందుకే సిలిండర్లపై పరిమితి : పనబాక లక్ష్మి

హైదరాబాద్‌: రాయితీ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే పరిమితులు విధించాల్సి వచ్చిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు సహాయ మంత్రి వసబాక లక్ష్మి స్పష్టం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు ఏడాదికి ఆరు సిలిండరు సరిపోతాయని జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు సర్వేల ఆధారంగా కేంద్రం నిర్థారించిందని చెప్పారు. ఆరు పరిమిత సిలిండర్లకు అదనంగా మూడు సిలిండర్లును అందించే ప్రక్రియ కేవలం ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు వరకే వర్తిస్తుందని తెలియజేశారు.