దుస్తుల వివాదంలో సింధు?

share on facebook

636085012088245807న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్ స్టార్స్‌ను బట్టల వివాదం వెంటాడుతోంది. బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు, జన హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాండ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీధర్ తమ బట్టలు ధరించలేదని, ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఓ ప్రముఖ దుస్తుల కంపెనీ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులందరూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలన్న షరతుతో భారత ఒలింపిక్స్ సంఘానికి రూ.3 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఆ కంపెనీ చెప్పిందట. సింధు, దీప, దత్, శ్రీకాంత్ కొన్ని మ్యాచుల్లో తమ బ్రాండ్ దుస్తులను కాకుండా ఇతర బ్రాండ్ల దుస్తులు ధరించారని తెలిపింది. ఈ మేరకు భారత ఒలింపిక్స్ సంఘానికి ఆ కంపెనీ ఓ లేఖ రాసినట్లు క్రీడా వర్గాల సమాచారం. ఈ క్రీడాకారులకు వేరే కంపెనీల దుస్తులను ఇచ్చిన ఫెడరేషన్లకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *