‘దేనికైనరెడీ ‘ చిత్రంపై కోర్టులో పిటిషన్
హైదరాబాద్: బ్రాహ్మణులను కించపరిచేవిదంగా చిత్రీకరించిన ‘దేనికైనరెడీ’ సినిమాపై మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారని న్యాయవాది శ్రీనివాస్‌యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు నాగేశ్వరరెడ్డి, నటులు విష్ణు, బ్రహ్మనందంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.



