దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
హైదరాబాద్,సెప్టెంబర్3(జనం సాక్షి): దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో ప్తర్యేక పూజలు, బజనలు కీర్తనలు చేపట్టారు. శ్రీకృష్ణ జన్మస్థలం మథురలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మథురలో ఉన్న జన్మభూమి గుడిలో కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. భక్తులంతా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. యాదాద్రి,భద్రాచలం, ధర్మపురి,సింహాచలం,తిరుపతి, ఇస్కాన్ ఆలయాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగరంలోని వివిధ ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు. కడపజిల్లా కలసపాడులోని శ్రీ కృష్ణ గీతా మందిరంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, విష్ణు సహస్రానామం, మహా నైవేద్య నివేదన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు సామూహిక గీతా పారాయణం చేశారు. కృష్ణార్జునుల పాలరాతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత సత్సంగ కన్వీనర్ సుంకు రామయ్య, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, వాసవీ మహిళ మండలి కార్యదర్శి సుంకు శంకుతల తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని కృష్ణమరె/-డడెప్లలె, గూడూరు ప్లలె గ్రామాల పరిధిలోని శ్రీకృష్ణాలయాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిపై ఊరేగించారు. దేవర ఎద్దు ఊరేగింపు చేపట్టారు. పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి పాల్గొని ఆలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు వితరణగా అందించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.



