దేశ రక్షణ, సైనికుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

share on facebook
నిర్మల్ బ్యూరో, జూన్27,జనంసాక్షి,,,  బీజేపీ పాలకులు దేశంలో వ్యవ్యస్తలన్నిటిని నిర్వీర్యం చేస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు,
ఏఐసీసీ పిలుపు మేరకు అగ్నిపత్ కు వ్యతిరేకంగా     సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన సత్యాగ్రహ దీక్ష లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి, దేశ భద్రత కు సంబందించిన సైనికుల రిక్రూట్మెంట్ విషయంలో నాలుగేళ్ల
కాంట్రాక్ట్ విధానం సైరైంది కాదని చెప్పారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని, నిరుద్యోగ యువతకు అండగా వుంటామని చెప్పారు.
ఇటు రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం జీతాలు ఇ వ్వలేని పరిస్తితిలో ఉందని ఆరోపించారు, లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు,
అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో నూ ప్రజలంతా సంతోషముగా లేరని చెప్పారు, ఈ రెండు పార్టీలకు ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.ఈకార్యక్రమంలో  నాయకులు తక్కల రమణ రెడ్డి, సరికేల గంగన్న, నాందేదపు చిన్ను,ముత్యంరెడ్డి, చంద్రకాంత్, అజర్,జామాల్, పోశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.