దోపిడీ ముఠా హ‌ల్‌చ‌ల్ దోపిడీ ముఠా హ‌ల్‌చ‌ల్

share on facebook

రంగారెడ్డి : శంషాబాద్‌లో దారి దోపిడీ ముఠా హ‌ల్‌చ‌ల్ సృష్టించింది. కారులో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి, క‌త్తుల‌తో బెదిరించి దోపిడీకి పాల్ప‌డ్డారు. రాళ్ల‌గూడ – ఉటుప‌ల్లి దారిలో వెళ్తున్న కారును ముగ్గురు వ్య‌క్తులు ఆపారు. అనంత‌రం లిఫ్ట్ పేరిట కారు ఎక్కారు. కొంచెం దూరం వెళ్లిన త‌ర్వాత ఆ ముగ్గురు వ్య‌క్తులు కారు డ్రైవ‌ర్‌ను క‌త్తుల‌తో బెదిరించారు.

భ‌య‌ప‌డ్డ డ్రైవ‌ర్ దుండ‌గుల దాడి నుంచి త‌ప్పించుకునేందుకు య‌త్నించాడు. దీంతో కారు అదుపుత‌ప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముగ్గురి దుండ‌గుల్లో ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌రొక‌రి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Other News

Comments are closed.