ద్రవిడ్‌కి ‘ఖేల్‌రత్న’, యువరాజ్‌కి ‘అర్జున’ నామినేషన్లు

ముంబాయి: ఇటీవల రిటైరైన క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరును రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు, క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన మరో యువ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ పేరును అర్జున అవార్డుకు నామినేట్‌ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. తమ ప్రతి పాదనలను వచ్చే వారం క్రీడ్రా మంత్రిత్వ శాఖకు పంపనున్నట్లు బీసీసీఐ సీఏఓ కత్నాకర్‌ శెట్టి చెప్పారు. ఈ నామినేషన్లుకు గడువును ప్రభుత్వం జులై 20 వరకు పెంచిన సంగతి తెలిసిందే.