ధరణి ఫోల్డర్ను వెంటనే వెంటనే రద్దు చేయాలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి

share on facebook
వికారాబాద్ రూరల్ నవంబర్ 24 జనం సాక్షి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ఫోల్డర్ను వెంటనే రద్దు చేయాలని టిపిసిసి పిలుపుమేరకు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ తాసిల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు గురువారం తహసిల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాకు ధరణి ఫోల్డర్ ను వెంటనే రద్దు చేయాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం ధరణి ఫోల్డర్ పేరుతో అర్హులైన రైతుల భూములను లాక్కొని రైతన్నలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక అణాచకాలకు పాల్పడుతుందని త్వరలో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు అర్హులైన రైతులందరికీ రైతుబంధు కౌలు రైతులకు రైతుబంధు అందించేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వ్యవసాయ రుణాలు వెంటనే మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ ఎంపీపీ చంద్రకళ వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఎర్రవల్లి జాఫర్ రత్నారెడ్డి మైపాల్ రెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

Other News

Comments are closed.