‘ధర్మానపై గవర్నర్‌ చర్యలు తీసుకోవాలి’:రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలో మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అవినీతిపరులను కాపాడేందుకే మంత్రి వర్గం ఇటువంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ అధికారాలతో ధర్మానపై గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రయత్నిస్తున్నాయన్నారు. గవర్నర్‌ రాజ్‌భవన్‌ను గాంధీభవన్‌గా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గూఢాచారిగా గవర్నర్‌ వ్యవహరిస్తే ఊరుకోమన్నారు. ధార్మన వ్యవహారం పై ఫిర్యాదుకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని  తెలియజేశారు.