ధాకరే స్మారక చిహ్నం తొలగింపు

ముంబయి: బాల్‌థాకరే స్మారక చిహ్నాన్ని శివసైనికులు ముంబయిలోని శివాజీ పార్కు నుంచి తొలగించారు. గత నెలలో ఆనారోగ్యంతో న్నుమూసిన శివసేన అధినేత బాల్‌ థాకరేకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి తాత్కాలిక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తి చేసింది. శివాజీ పార్కులో థాకరే స్మారకాన్ని  ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని  మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్‌ తెలిపారు. అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవడంతో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శివసైనికులు థాకరే స్మారక  చిహ్నాన్ని అక్కడి నుంచి తొలగించారు.