నక్సల్స్ దాడిలో ఇద్దరు జావాన్ల మృతి
బీహార్: నక్సల్స్ దాడిలో ఇద్దరు జవాన్లు మృతిచెందిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గయా జిల్లా చకర్‌బందా అటవీప్రాంతంలో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందారు. గయా జిల్లా డుమ్రియా వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



