నగరంలో ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం పర్యటన..

హైదరాబాద్ : నేడు ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం నగరంలో పర్యటించనుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులను బృందం పరిశీలించనుంది. ప్రక్షాళనపై సీఎం కేసీఆర్ కు బృందం సోమవారం నివేదిక ఇవ్వనుంది.