నగరంలో హోలీ వేడుకలు
హైదరాబాద్ : నగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. సభ్యులు ఒకరిపైఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. బేగంబజార్‌లో హోలీ ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. యువతీయువకులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సంతోషంగా గడిపారు. హోలీ పరికరాలు, రంగులు కొనడానికి వచ్చినవారితో ఇక్కడి దుకాణాల వద్ద సందడి నెలకొంది.



