నగల వ్యాపారిని బెదిరించి దోచుకున్న కానిస్టేబుల్ అరెస్ట్
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రాంతంలో ఓ నగల వ్యాపారిని బెదిరించి రూ.4,34,500 దోచుకున్న ఏఆర్ కానిస్టేబుల్ అచ్చిరెడ్డి రఘువీర్‌ను పోలీసులు ఆరెస్ట్ చేశారు. వ్యాపారిని తుపాకితో బెదిరించి డబ్బు తీసుకెళ్లటంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో దఘువీర్నుంచి ద్విచక్రవాహనం, 10 రౌండ్ల బుల్లెట్, తుపాకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



