నయీంను ప్రభుత్వ పెద్దలే పెంచి పోషిస్తున్నారు : కోనపురి రాములు

హైదరాబాద్‌: తన సోదరుడు సాంబశివుడిని హత్య చేసినట్లే తనకూ ప్రాణ హాని ఉందని మాజీ మావోయిస్టు కోనపురి రాములు ఆందోన వ్యక్తం చేశారు. గత కొద్ది నెలలుగా అపరిచిత వ్యక్తులు తనకు ఫోన్‌ చేసి హత్య చేస్తామని హెచ్చరిస్తున్నారని  ఆయన హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అనేకసార్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. తన సోదరుడి హత్య కేసులో ప్రధాని నిందితుడైన నయీంను  ఇంతవరకూ అరెస్టు చేయలేదని అతడిని ప్రభుత్వ పెద్దలే పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. తనకూ, తన కుటుంబానికి ఏ హాని జరిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచర్చరించారు.

తాజావార్తలు