నవంబర్‌ 1ని బ్లాక్‌ డేగా పాటించండి: కేసీఆర్‌

హైదరాబాద్‌: నవంబర్‌ 1ని ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని బహిస్కరించి తెలంగాణలో బ్లాక్‌ డే గా పాటించాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులంతా తెలంగాణ పది జిల్లాల్లో నల్ల జెండాలు ఎగరవేసి నిరసనలు తెలియజేయాలన్నారు.