నాపై రాజకీయ కుట్ర జరుగుతోంది : బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: పత్రికల్లో వస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి లేఖ రాశారంటే తాను నమ్మలేనని పీసీసీ ఛీఫ్‌ బొత్స సత్యనారాయణ అన్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కథనం రాసిన పత్రికపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలియజేశారు. టీవీ ఛానళ్లు కూడా ఆ కథనం ఆపి వేయాలని లేదంటే వాటిపై కూడా న్యాయపరంగా ముందుకు వెళ్తానని అయన అన్నారు.

తాజావార్తలు