నార్త్‌బ్లాక్ ప్రాంగణంలో ఐకాస నేతల ఇందోళన
న్యూఢిల్లీ: హోంమంత్రి కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ఐకాస నేతలు ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న పలువురు ఐకాస నేతలు భేటీ ప్రారంభయ్యే ముందు నిరసన చేపట్టారు. అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి షిండే, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాగానే జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులను భద్రతా సిబ్బంది. అడ్డుకున్నారు.