నార్వే యువతికి లైంగిక వేధింపులు

నిజామాబాద్‌ : మహిళా సంఘాలు ఎంత ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడంలేదు. ఈ విషయంలో ఇప్పటికే అంతర్జాతీయంగా మన పరువు బజారున పడింది. సికింద్రాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లే బస్సులో కొంతమంది ఆకతాయిలు నార్వే యువతిని వేధించారు.ఆ యువతి బస్సును డిచ్‌పల్లిలో ఆపించి, అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ నరేష్‌ కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన అయిదుగురు యువకులు అదుపులోకి తీసుకున్నారు.
భారత్‌ అత్యాచారాల అడ్డాగా మారిందని, ఆ దేశానికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని బ్రిటన్‌ తమ దేశ మహిళలను హెచ్చరించింది. ఈ నేపధ్యంలో మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.