నా భూమి నాకు ఇప్పించండి సార్.

..

 

 

 

 

 

 

 

– కలెక్టరేట్ గ్రీవెన్స్ లో బాధితుడు గోపాల్ ఫిర్యాదు

 

వరంగల్ బ్యూరో మార్చి06  (జనం సాక్షి)తన సొంత భూమి కబ్జాకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ నా భూమి నాకు ఇప్పించండి సార్ అంటూ తొర్రూర్ కు చెందిన బైరు గోపాల్ వరంగల్ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తొర్రూరు 2006లో ఎస్డి నదీమ్ అఫ్జల్ దగ్గర తిమ్మాపూర్ హవేలీ ప్రాంతంలోని నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో గల ఆర్టిఏ కార్యాలయం వద్ద సర్వే నెంబర్ 143/ బి లోని గుంటల భూమిని కొనుగోలు చేశారు అలాగే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. 2011లో కరెంటు మీటర్ కూడా తీసుకున్నాడు అదే సంవత్సరం ఇంటి పర్మిషన్ కోసం గోడ నిర్మాణానికై అనుమతి పొందాడు 2013లో తిరిగి పర్మిషన్ను రెన్యువల్ చేయించుకున్నాడు. 2018లో మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఇంటి నిర్మాణానికి అనుమతితో పాటు కూడా అధికారులకు ఎల్ఆర్ఎస్ కట్టాడు. గోడ గేటు నిర్మాణం కూడా చేశారు. ఈ క్రమంలో ఇటీవల ఈ భూమి తమది అంటూ  యాదగిరి, తిరుపతి రెడ్డి అనే వ్యక్తులు  తప్పుడు కాగితాలు సృష్టించి తన భూమి మీదికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని  వీరి నుండి తన భూమి తనకు ఇప్పించాలని  బాధితుడు గోపాల్ కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.  ఈ క్రమంలో కలెక్టర్ స్పందించి వరంగల్ పోలీస్ కమిషనర్ కు సమస్య ఫార్వర్డ్ చేసినట్లు గోపాల్ తో పాటు అతని అనుచరులు కందికట్ల మధుసూదన్, రాజ్ కుమార్ తెలిపారు. త్వరలో సిపిని కలవ ను న్నట్లు వారు వివరించారు.