నింగిలోకి ‘దృష్టి’..
` విజయవంతంగా కక్ష్యలోకి ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహం
` బెంగళూరుకు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ గెలాక్సఐ రికార్డు
` భూ పరిశీలన సాంకేతికత పరిజ్ఞానంలో కీలక మైలురాయి
బెంగుళూరు(జనంసాక్షి):బెంగళూరుకు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ గెలాక్సఐ పంపించిన ‘దృష్టి’ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలోని ప్రయోగ కేంద్రం నుంచి ఫాల్కన్`9 రాకెట్ సాయంతో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు గెలాక్సఐ వెల్లడించింది. ఇది ప్రపంచంలో ఆప్టో`సార్ సాంకేతిక కలిగిన మొట్టమొదటి ఉపగ్రహమని పేర్కొంది. భూ పరిశీలన సాంకేతికత పరిజ్ఞానంలో ఇది కీలక మైలురాయి అని తెలిపింది.“190 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం.. భారత్‌లోని ప్రైవేటు సంస్థ నిర్మించిన శాటిలైట్లలో అతిపెద్దది. 1.5 విÖటర్ల రిజల్యూషన్‌తో చిత్రాలను అందిస్తుంది. ఆప్టో`సార్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఎలక్టో ఆప్టికల్, సింథటిక్ ఎపెర్చర్ రాడార్ సెన్సర్లతో కలిపి పరిశీలనలు సాగిస్తుంది. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లో.. పగలు, రాత్రి తేడా లేకుండా భూమిని నిరంతరం పరిశీలించే సామర్థ్యం దీని సొంతం” అని గెలాక్సఐ పేర్కొంది. గెలాక్సఐ చేపట్టిన దృష్టి ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధనల్లో ఇదో కీలక విజయంగా నిలుస్తుందన్నారు. దేశ పురోగతి, ఆవిష్కరణల పట్ల యువత అభిరుచికి ఇదో నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా గెలాక్సఐ బృందానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.


