నిట్‌లో ఆలిండియా బ్యాడ్మింటన్‌ పోలీలు ప్రారంభం

వరంగల్‌: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్‌)లో అఖిల భారత బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటినుంచి ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ పోటీలకు ముఖ్య అతిధిగా బాల్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌, అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్య పాల్గొని జెండా వూపి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో ఆడి  ఉత్సాహపరిచారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 85 యూనివర్శిటీలనుంచి 81 మంది యువకులు, 73 మంది యువతులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు.