నితీశ్‌ వర్సెస్‌ మోడీ..

పాట్నా : హోలీ పండుగ సందర్భంగా రంగులు జల్లుకునే పిచికారీల్లో ఇప్పుడు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బొమ్మకే గిరాకీ ఎక్కువైంది. పిల్లలు, యువత కూడా తమ ముఖ్యమంత్రి బొమ్మకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారట. ఇప్పటివరకు పిచికారీలకు సినిమా యాక్టర్ల బొమ్మలు, క్రికెటర్ల బొమ్మలు పెట్టి తయారు చేయడం అనవాయితీ. ఈ సారి కొత్తగా నితీశ్‌, మోడీ, లాలూ లాంటి రాజకీయనేతల బొమ్మల్నీ తయారు చేశారు. వాటిల్లో నితీశ్‌ బొమ్మకు ఎక్కువ గిరాకీ లభిస్తోందని ఆ తర్వాతి స్థానం మోడీదని వ్యాపారస్తులు చెప్తున్నారు. క్రికెటర్ల బొమ్మలకన్నా బాలీవుడ్‌ హీరోల బొమ్మలే ఎక్కువ అమ్ముడవుతున్నాయని కూడా వారు పేర్కొన్నారు.