నిబంధనలకు విరుద్దంగా వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల కొరడా
హైదరాబాద్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. కార్లకు ఫిలిం, ఎటువంటి స్టిక్కర్లు, బొమ్మలు అంటించినా చర్యలు తప్పవంటున్నారు. ఈ మేరకు నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ.500 జరిమానాలతో పాటు సిబుక్, లైసెన్స్ స్వాధీనం చేసుకుంటామని అధికారులు చెబుతున్నారు.



