నిరహార దీక్ష విరమించిన వామపక్ష నేతలు
హైదరాబాద్ : వామపక్ష నేతలు నిరాహార దీక్ష విరమించారు. ఇందిపార్కు వద్ద చేస్తున్న దీక్షను నిన్న రాత్రి పోలీసులు భగ్నం చేసి నేతలను బలవంతంగా గాంధీ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో దీక్ష కొనసాగించిన రాఘవులు, నారాయణ సహా ఏడుగురు వామపక్ష నేతలు ఐదు రోజులుగా కొనసాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారు. తమ దీక్ష వల్ల ప్రభుత్వం కొంతమేర దిగివచ్చిందని రాఘవులు అన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును తగ్గించేందుకు పునరాలోచన చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం వాణిజ్యం విధానానికి స్వస్తి పలకాలని, విద్యుత్ ఉత్పత్తిలో జెస్‌కోకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.


