నిరుపేద కుటుంబానికి ముత్యాల సునీల్ రెడ్డి చేయూత
ప్రతినిధి(జనంసాక్షి):మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంభం గ్రామంలో కాలువ ప్రక్కన ఒక చిన్న గుడిసెలో జీవిస్తున్న వారికి అరేంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి చేయూత అందించారు. నిరుపేద కుటుంబానికి అపన్నాహస్తం అందించాలని మానవత్వం తో స్పందించి గురువారం నాడు సునీల్ రెడ్డి ఐదు వేల రూపాయలు పంపించడంతో ఆ డబ్బులను సునీల్ యువసేన నాయకులు ఆ కుంటుంబానికి అందించారు.తమ ఆర్థిక పరిస్థితి గురించి సునిల్ రెడ్డికి తెలుపగా వెంటనే డబ్బులు పంపియడంతో ఆయనకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సునీల్ యువసేన నాయకులు దైడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.